ఎన్ని తలచినా ఏది అడిగినా

ఎన్ని తలచినా ఏది అడిగినా

జరిగేది నీ చిత్తమే ప్రభువా (2)

నీ వాక్కుకై వేచియుంటిని

నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా (2)

1. నీ తోడు లేక నీ ప్రేమ లేక –

ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)

అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)

నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా (2)||ఎన్ని||

2. నా ఇంటి దీపం నీవే అని తెలసి –

నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)

ఆరిపోయిన నా వెలుగు దీపము (2)

వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా (2) ||ఎన్ని||

3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా –

నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)

లోకమంతయూ నన్ను విడచినా (2)

నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా (2)  ||ఎన్ని||

4. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి

నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)

నీదు యాగమే నా మోక్ష మార్గము (2)

నీయందే నిత్యజీవము ప్రభువా (2) ||ఎన్ని||

Scroll to Top