మణులు మాణిక్యములున్న – మేడమిద్దెలు ఎన్నున్నా
మదిలొ యేసు లేకున్నా – ఏది వున్నా అది సున్నా
1.
చదువులెన్నో చదివున్నా – పదవులెన్నో చేస్తున్నా
విద్య వున్నా బుద్ది వున్నా – జ్ఞానమున్నా అది సున్నా
2.
అందచందా లెన్నున్నా – అందలముపై కూర్చున్నా
సుందరుడగు ప్రభు లేకున్నా – అందమున్నా అది సున్నా
3.
రాజ్యములు రమణులున్నా – శౌర్యములు గల వీరులున్నా
బలము వున్నా బలగమున్నా – ఎన్నియున్నా అవి సున్నా
4
పూజ్యుడా పుణ్యాత్ముడా – పుణ్యకార్య సిద్దుడా
దానధర్మము తపము జపము – యేసు లేనివి అన్నీ సున్నా
