స్థోత్రించెదము స్థోత్రించెదము

స్తోత్రించెదము – స్తోత్రించెదము యేసుదేవుడా
మా జీవనాధ – ప్రేమనాధ స్తోత్రించెదము

ఏడు నక్షత్రములను – కుడిచేత పట్టుకొని
యేడు దీపంబుల మధ్య – సంచరించువాడా

మొదటివాడ కడపటివాడా – మృతుడైనవాడా
మృతినిగెల్చి లేచినవాడా – మదినిను దలచెదమూ

వాడియైన రెండంచుల – ఖడ్గము కలవాడా
పాడి నిన్ను భజియించెదము – పరమ పురి వాస

అగ్నిజ్వాల వంటి – కన్నులు కలిగినవాడా
అపరంజిని బోలిన – పాదముల దేవుని కుమార

ఏడు నక్షత్రములు – దేవుని యేడాత్మలునూ
కలిగిన వాడా కరుణించి – మము కాపాడుమయ్యా

దావీదు తాళపుచెవిని – బడసినవాడా
సత్యస్వరూపి పరిశుద్ధుండా -సంఘములకు కర్తా

ఆమెన్ అనువాడా – నమ్మకమైన నా నాథుడా
సత్యసాక్షి దేవుని సృష్టికి – అదియు నీవేగా

Save to list

Scroll to Top