రండి యెహోవాను గూర్చి

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము
ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడనీ
అహా – హల్లెలూయ

చరణం 1:
కష్ట నష్టాలు, పొంగు సాగరాలు ఎదురైనా
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో 

చరణం 2:
విరిగి నలిగిన హృదయంతో దేవ దేవుని సన్నిధిలో
అనిశం ప్రార్థిస్తే – ఎన్నో ఈవులు కలుగుతాయి

చరణం 3:
త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడు
నీతి సూర్యుడు ఆయనే అని నిత్యము స్తుతి చేయుదము

Save to list

Scroll to Top